Translate

Wednesday, March 13, 2019

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


కౌంటింగ్ పూర్తవగానే ప్రత్యర్థులను నరుక్కుంటూ పోదాం… టీడీపీ ఎమ్మెల్యే సూరి

Posted: 13 Mar 2019 09:55 AM PDT

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆడియో టేపు ఇప్పుడు సంచలనంగా మారింది. సూరిపై అసమ్మతితో ఉన్న టీడీపీ నేతలే ఈ ఆడియో టేపులను బయటపెట్టారు. కీలకమైన కార్యకర్తలతో సూరి మాట్లాడుతున్న ఈ ఆడియో టేపులో ఆందోళన కలిగించే అంశాలున్నాయి. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదని కార్యకర్తలతో సూరి వ్యాఖ్యానించారు. కౌంటింగ్ పూర్తయిన క్షణం నుంచే ప్రత్యర్థులను నరుకుదాం… చంపేద్దామంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే. ప్రత్యర్థులను చంపుతుంటే అడ్డురాకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే ఆదేశిస్తామని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తిరిగి అధికారంలోకి […]

వీరే తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధులు !

Posted: 13 Mar 2019 09:50 AM PDT

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. తొలి జాబితాలో ఎనిమిది మందిని లోక్ సభ అభ్యర్ధులుగా ప్రకటించారు. మొత్తం 17 స్ధానాలున్న తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తొలి జాబితాగా ఎనిమిది మంది అభ్యర్ధులను ప్రకటించారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారు. ఆ […]

వారేవ్వా! సానియా… మూడునెలల్లో 22 కిలోలు తగ్గిన టెన్నిస్ క్వీన్

Posted: 13 Mar 2019 08:50 AM PDT

తల్లిహోదాలో ఇక సానియా టెన్నిస్ టైటిల్స్ వేట గత ఏడాదిగా టెన్నిస్ కు దూరమైన సానియా భారత టెన్నిస్ క్వీన్, ప్రపంచ మహిళా డబుల్స్ మాజీ నంబర్ వన్ సానియా మీర్జా… ఏడాది విరామం తర్వాత… ఓ బిడ్డకు తల్లిగా తిరిగి టెన్నిస్ బరిలోదిగటానికి తహతహలాడుతోంది. ఐదుమాసాల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా…. కాన్పు తర్వాత విపరీతమైన బరువుతో  ఫిట్ నెస్ కు దూరమయ్యింది. అయితే…అంతర్జాతీయ టెన్నిస్ లో రాణించాలంటే పూర్తి ఫిట్ నెస్ అవసరమని గ్రహించిన […]

ప్రచారాన్ని ఖండించిన మురళీమోహన్

Posted: 13 Mar 2019 06:37 AM PDT

కేసీఆర్‌ బెదిరించడం వల్లే పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు వైసీపీలో చేరుతున్నారన్న చంద్రబాబు, టీడీపీ ప్రచారాన్ని సొంత పార్టీ ఎంపీ మురళీమోహనే ఖండించారు. అలాంటిదేమీ లేదన్నారు. కేసీఆర్‌ బెదిరిస్తే సినీ ప్రముఖులు పార్టీలు మారుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సినిమా వాళ్లు ఎవరికీ భయపడే పరిస్థితి ఉండదన్నారు. తాను కూడా కేవలం ట్రస్ట్‌ అభివృద్ధి కోసమే పోటీ నుంచి తప్పుకున్నానని… అంతకు మించి మరో కారణం లేదన్నారు. రాజమండ్రి నుంచి తన కోడలును బరిలోకి దింపే అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. తాను ఎవరో బెదిరిస్తే భయపడే పరిస్థితి […]

చిరంజీవితో సినిమా…. ఒప్పుకుంటుందా?

Posted: 13 Mar 2019 06:30 AM PDT

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు స్టార్ దర్శకుడు కొరటాల శివ తో ఒక సినిమా చేయనున్నారు. ఒక మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం గత […]

మరో క్రేజీ కాంబినేషన్ కలిసింది

Posted: 13 Mar 2019 05:33 AM PDT

కోలీవుడ్ లో కార్తికి మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో రష్మికకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిశారు. ఫ్రెష్ కాంబోలో ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. ఆ మూవీ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. రెమో సినిమా తీసిన భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఈ బ్యానర్ పై ప్రస్తుతం కార్తి హీరోగా ఖైదీ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇదే […]

కల్యాణి అందుకే రాలేదట

Posted: 13 Mar 2019 05:10 AM PDT

ఈ రోజు ఉదయం చిత్రలహరి టీజర్ లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. హీరో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హీరోయిన్ నివేత పెతురాజ్ కూడా వచ్చింది. కానీ మెయిన్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాత్రం రాలేదు. ఆమె కనిపించకపోయే సరికి మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆమెకు టాలీవుడ్ అంటే లెక్కలేదని కొందరు, యూనిట్ కు కల్యాణికి విభేదాలు వచ్చాయని మరికొందరు పుకార్లు పుట్టించారు. కానీ కల్యాణి గైర్హాజరీ వెనక కారణం వేరే ఉంది. కోలీవుడ్ […]

కేజీఎఫ్ చాప్టర్ 2 లాంఛ్ అయింది

Posted: 13 Mar 2019 05:08 AM PDT

సౌత్ లో బాహుబలి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకుంది కేజీఎఫ్. సౌత్ లో వసూళ్లు పరంగా కూడా టాప్-5లో నిలిచింది. అలా ఇండియా అంతటా సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ స్టార్ట్ అయింది. కేజీఎఫ్ చాప్టర్-2 ఈరోజు బెంగళూరులోని కంఠీరవ స్టుడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో యష్ ఈ ఓపెనింగ్ కు హాజరయ్యాడు. KGF Chapter 2- Muhurtha♥️Yet another new beginning for all of us..This time bigger […]